Tuesday, November 6, 2007

భారత భాషలకు టెలిస్మా వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజ

ఫ్రెంచి కేంద్రంగా ఐటీ కార్యకలాపాలను నిర్వహించే టెలిస్మా సంస్థ తొమ్మిది భారతీయ భాషలకు వాయిస్ రికగ్నిషన్ దిశగా సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ముందుకువచ్చింది. టెలిస్మా ఇప్పటికే తన సాఫ్ట్‌వేర్ విక్రయాల కోసం విప్రో, సిస్కో, కేప్, జెమిని, అటోస్ ఆరిజిన్ తదితర సంస్థలతో చేతులు కలిపింది.


టెలిస్మా ప్రెసిడెంట్ మరియు సిఇఓ లారెట్ బాలైన్ న్యూఢిల్లీలో మాట్లాడుతూ టెలీకాం, పర్యాటకం మరియు ఆరోగ్య పరిరక్షణ వంటి పౌర సంబంధిత రంగాల అభివృద్ధికి వాయిస్ రికగ్నిషన్ ఎంతో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఈ సంస్థ ఆంగ్ల భాష కోసం రూపొందించిన వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను భారతీయ ఉచ్ఛారణకు అనుగుణంగా సిద్ధం చేసింది.


భారత్‌లో వాయిస్ రికగ్నిషన్ మార్కెట్ వచ్చే ఐదేళ్లలో 45 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఫ్రాస్ట్ అండ్ సుల్లివాన్ అంచనావేసింది.

Source: http://content.msn.co.in/Telugu/InfoTech/News/0711-05-3.htm



0 comments: